రక్తాపరాధం కింద 2 లక్షల ధిర్హాంలు చెల్లించాలని నిర్లక్ష్య డ్రైవర్ కు కోర్టు తీర్పు

- February 22, 2018 , by Maagulf
రక్తాపరాధం కింద 2  లక్షల ధిర్హాంలు చెల్లించాలని నిర్లక్ష్య డ్రైవర్ కు కోర్టు తీర్పు

యూఏఈ  : నిర్లక్ష్యంగా డ్రైవర్ వాహనం నడిపి రోడ్డు ప్రమాదం చేసి ఓ వ్యక్తి మరణంకు కారకుడయినా కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబానికి రక్తాపరాధం కింద 2 లక్షల ధిర్హాంలు అదేవిధంగా వారి బంధువుని కోల్పోయినందుకు మరో 50 వేల ధిర్హాంలు అదనంగా చెల్లించాల్సిందిగా నిందిత డ్రైవర్ కు యూఏఈ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కోర్టు అధికార రికార్డుల ప్రకారం ఉత్తర ఎమిరేట్స్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆసియా దేశాలకు చెందిన  వ్యక్తి చనిపోయాడు. పోలీసుల దర్యాప్తు ప్రకారం  స్థానిక సంస్థకు చెందిన వాహన డ్రైవర్ ఈ ప్రమాదంకు ముఖ్య కారణమయ్యాడని నివేదించారు . నిర్లక్ష్యంగా డ్రైవింగ్  చేసి తమ కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రాణాలు తీసినందుకు ఆ  కుటుంబం దాఖలు చేసిన ఒక చట్టపరమైన కేసును న్యాయస్థానంలో దాఖలు చేసింది మరియు వారి భీమా సంస్థపై జరిగిన రోడ్డు ప్రమాదంపై నష్టపరిహారం కోసం డిమాండ్ చేసింది ఎందుకంటే ఆ బాధిత కుటుంబానికి ఏకైక ఆధారం చనిపోయిన వ్యక్తి అని న్యాయాధిపతులే ఎదుట మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ రక్తాపరాధం కింద 2 లక్షల ధిర్హాంలు అదేవిధంగా వారి బంధువుని కోల్పోయినందుకు మరో 50 వేల ధిర్హాంలు బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారాన్ని చెల్లించాలని డ్రైవర్ మరియు భీమా సంస్థను ఆదేశించింది.డ్రైవర్, భీమా సంస్థ ఇరువురు ఆ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ కోర్టు 100,000  ధిర్హాంలకు రక్తపరాదాన్ని తగ్గించింది. బాధితురాలి కుటుంబం తిరిగి అబుదాబీలోని ఫెడరల్ సుప్రీం కోర్టుకు అప్పీల్ చేసింది. అప్పీల్ కోర్టు తీర్పును రద్దు చేసి, తీర్పును తొలిసారి కోర్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. డిప్యూటీ కోర్టు 2 లక్షల ధిర్హాంల నుంచి 1 లక్ష ధిర్హాంలు వరకు తగ్గించాలని కోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని. తొలుత ఇచ్చిన తీర్పు అన్ని కారణాలను అంచనా వేసిన తర్వాత బాధిత కుటుంబానికి రక్తాపరాధం కింద 2  లక్షల ధిర్హాంలు చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగిందని ఎందుకంటే ఇది కోర్టు పరిశీలనలో సహేతుకమైనది. వాస్తవానికి  బాధిత కుటుంబం వారి బంధువులకు జరిగిన నష్టానికి పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com