మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న నూతన సౌదీ వివాహ చట్టం

- February 23, 2018 , by Maagulf
మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న నూతన సౌదీ వివాహ చట్టం

రియాధ్: ఇటీవల పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొంటున్న సౌదీ అరేబియా వివాహచట్టంలో విన్నూత్న  చర్యలకు శ్రీకారం చుట్టింది.. ఇదివరకు చట్టంలో .. భర్త చెప్పినట్లు భార్య వినాల్సిందే. ఆమెకు ఇష్టం లేకున్నా, భరిస్తూనే భర్తతో కాపురం చేయాలి . భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్నా కచ్చితంగా  భర్త అనుమతి తీసుకోవాల్సిందే. చివరకి  భర్తతో పోట్లాడి పుట్టింటికి వెళ్లినా.. భర్త ఆదేశిస్తే ఉరుకులు పరుగుల మీద భర్త ఇంటికి రావాల్సిందే. ఈ కాలం చెల్లిన నిబంధనలకు సౌదీ ప్రభుత్వం  పాతరేసింది. నూతన వివాహ చట్టంలోని  నిబంధనల ప్రకారం ఒకవేళ  భార్యకు ఇష్టం లేకుంటే భర్త పెత్తనం ఇకపై ఏమాత్రం పనిచేయబోదని  నేరుగా తెలిపింది. ఇంటికి రావాల్సిందే అంటూ భర్త ఆజ్ఞలు ఇకపై కుదరదని నిబంధనలను మార్చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com