క్రేన్‌లో హాస్పిటల్‌కు వెళ్లాడు.. 610 కిలోల బరువు మరి..

- February 24, 2018 , by Maagulf
క్రేన్‌లో హాస్పిటల్‌కు వెళ్లాడు.. 610 కిలోల బరువు మరి..

సౌదీ అరేబియా:బరువు బద్దకాన్ని తెచ్చిపెడుతుంది. అది మరి కాస్త బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. హర్మోన్ల ప్రభావంతో శరీరం కొండలా పెరుగుతోంది. అలా ఏకంగా 610 కిలోల బరువు పెరిగాడు. ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయుడిగా చరిత్రకెక్కాడు కానీ బరువుని భరించడం కష్టంగా మారింది. సౌదీ అరేబియాకు చెందిన 25 ఏళ్ళ ఖాలిద్ అల్ షెరీ 2013లో అత్యంత స్థూల కాయుడిగా రికార్డులకెక్కాడు. కానీ అతను అవస్థలు చెప్పనలవి కానివి. కనీసం నిలబడలేడు. ఎప్పుడూ పడుకునే ఉండాలి. అతడ్ని పోషించడం తల్లిదండ్రులకి కూడా కష్టంగా మారింది. మా అబ్బాయిని కాస్త పట్టించుకోండంటూ సౌదీ రాజుకి మొరపెట్టుకున్నారు తల్లిదండ్రులు. దాంతో రాజు ఖాలిద్‌కి  వైద్యానికి అయ్యే నిధులు మంజూరు చేస్తానంటూ వాగ్ధానం చేశారు. దాంతో ఓ క్రేన్ తీసుకువచ్చి ఖాలిద్‌ని హాస్పిటల్‌కు తరలించారు. రియాద్‌లోని వైద్యులు 30 మంది ఆరు నెలలు కష్టపడి 320 కిలోల బరువు తగ్గించారు. నాలుగు సంవత్సరాలు ఈ విధంగా ట్రీట్ మెంట్ అందుకున్న అనంతరం అతడి బరువు ప్రస్తుతం 68 కిలోలకు చేరుకుంది. హమ్మయ్య ఇప్పుడు హాయిగా ఉన్నాను అంటూ ఊపిరి పీల్చుకున్నాడు ఖాలిద్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com