జాతీయ దినోత్సవ సందర్భంగా MoI ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గిస్తుందనే పుకార్లు నమ్మవద్దు

- February 24, 2018 , by Maagulf
జాతీయ దినోత్సవ సందర్భంగా MoI ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గిస్తుందనే పుకార్లు నమ్మవద్దు

కువైట్ : శుక్రవారం దేశీయ జాతీయ దినోత్సవ సందర్భంగా పౌరులు, నివాసితులపై ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల ఉదారంగా వ్యవహరించి కేసులు పెద్దగా ఉండవని  కొన్ని సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న   అసత్యపు పోస్టులను ఇంటీరియర్ మంత్రిత్వశాఖ శుక్రవారం తిరస్కరించింది. ఈ అంశంపై పోస్ట్ చేసినవన్నీ  నకిలీ వార్హలని మంత్రిత్వ శాఖ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక సంస్థల నకిలీ పోస్టులు  మరియు సమాచారాన్ని పోస్ట్ చేసిన వారికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని ధృవీకరించింది. విశ్వసనీయమైనవిగా పేర్కొన్న వార్తల మూలాలని నిర్ధారించుకోండని మంత్రిత్వశాఖ వివిధ మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com