అలనాటి అతిలోక సుందరి ఇక లేరు

- February 24, 2018 , by Maagulf
అలనాటి అతిలోక సుందరి ఇక లేరు

దుబాయ్:బాలీవుడ్ నటుడు మొహితా మార్వా వివాహం కోసం యుఎఇలోని రాస్ అల్ కైమా వెళ్లిన నటి శ్రీదేవి శనివారం రాత్రి 11 నుంచి 11.30 గంటల మధ్య తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. శ్రీదేవి మరణవార్త తెలిసిన వెంటనే ముంబై నుంచి దుబాయ్ బయలుదేరిన ఆమె మరిది సంజయ్ కపూర్ ఈ విషయం చెప్పారు.

తమ అభిమాన నటి శ్రీదేవి ఇక లేరని తెలియగానే సినిమా రంగంతో పాటు, ఆమె అభిమానులంతా తీవ్ర విషాదానికి లోనయ్యారు. కేవలం 54 ఏళ్ళ వయసులోనే ఆమె దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తూ శ్రీదేవితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

భారత సినిమా రంగంలోని నటీమణుల్లో తొలిసారి సూపర్ స్టార్ హోదా దక్కించుకున్న హీరోయిన్ శ్రీదేవి. మరీ ముఖ్యంగా దక్షిణాది నుంచి వెళ్ళి బాలీవుడ్‌ను ఏలిన ఘనతను శ్రీదేవి దక్కించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com