భారీ పోరాట సన్నివేశాలకు సిద్ధమవుతున్న 'సాహో'
- February 24, 2018
భారీ పోరాట సన్నివేశాలకు సిద్ధమవుతున్నారు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సాహో నాలుగో షెడ్యూల్లో అడుగుపెడుతోంది. ఈ షెడ్యూల్లో మొత్తం పోరాట సన్నివేశాలనే చిత్రీకరించనున్నారు. అబుదాబి, బుర్జ్ ఖలీఫా దగ్గర భారీ యాక్షన్ సన్నివేశాలు రూపొందించేందు కు సన్నాహాలు పూర్తయ్యాయి. గతంలో ఒకసారి అనుమతులు దొరకక..హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపారు. ప్రస్తుతం అన్ని అనుమతులు రావడంతో పాటు స్టంట్స్ కోసం ప్రభాస్ పూర్తిగా సన్నద్ధమయ్యారు. నీటి అడుగున జరిగే పోరాటాల కోసం స్కూబా డైవింగ్ తో పాటు కార్డియో వాస్కులర్, వెయిట్, పాలీమెట్రిక్ అబ్స్ట్రాకిల్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. పూర్తి సన్నద్ధతతో ప్రభాస్ సాహో పోరాటాల కోసం వెళుతున్నారు. సమాచారం ప్రకారం ఆదివారం నుంచి దుబాయ్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటిదాకా చూడని సుదీర్ఘ పోరాట భాగాలు సాహోలో ఉండబోతున్నాయి. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో చిత్రీకరణ జరగనుంది. ఈ పోరాటాల రూపకల్పన కోసమే పాతిక కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మొత్తం 150 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో యూవీ క్రియేషన్స్ సంస్థ సాహో చిత్రాన్ని నిర్మిస్తోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా కపూర్ నాయిక కాగా.నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, అరుణ్ విజయ్, జాకీ శ్రాఫ్, మహేష్ మంజ్రేకర్, టినూ ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







