శ్రీదేవి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన
- February 24, 2018
విశాఖపట్టణం: అందాల తార శ్రీదేవి(54) గుండెపోటుతో మరణించారు. దుబాయిలో ఓ వివాహ వేడుకకి హాజరైన ఆమె.. శనివారం రాత్రి అక్కడే తుదిశ్వాస విడిచారు. శ్రీదేవి మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె మరణవార్తను విన్న అభిమానులు, సినీ ప్రముఖులు షాక్‌కు గురవుతున్నారు. కాగా... శ్రీదేవి మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విశాఖలో చంద్రబాబునాయుడు ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... బహుభాషా నటిగా, ముఖ్యంగా తెలుగువారికి అత్యంత ఇష్టమైన కథానాయకగా ఎదిగారని అన్నారు. అసమానమైన తన అభినయంతో దేశం గర్వించదగ్గ నటిగా నిలిచిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..







