హెచ్ 1బీ వీసాపై రెజల్యూషన్

- February 25, 2018 , by Maagulf
హెచ్ 1బీ వీసాపై రెజల్యూషన్

వాషింగ్టన్‌: అమెరికన్లు, వలసేతర కార్మికుల వేతనాలు, పరిస్థితుల్ని మెరుగుపర్చేందుకే ట్రంప్‌ యంత్రాంగం కొత్త హెచ్‌1బీ వీసా పాలసీని తీసుకొచ్చిందని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) శనివారం తెలిపింది. అమెరికాలో కొన్ని సంస్థలు ఉద్యోగులకు ఇవ్వాల్సిన దానికన్న తక్కువ వేతనాలు చెల్లించడం, ఖాళీగా కూర్చోబెట్టడం, నైపుణ్యానికి సంబంధంలేని పనుల్ని అప్పగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. ఇలాంటి మోసాలను అరికట్టేందుకే కొత్త హెచ్‌1బీ విధానాన్ని తీసుకొచ్చామని వివరించింది. ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రకారం థర్డ్‌ పార్టీ వర్క్‌సైట్లలో కాంట్రాక్ట్‌ కాలపరిమితి మేరకే హెచ్‌1బీ వీసాను జారీచేస్తారు. అమెరికన్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) గురువారం జారీ చేసిన ఏడు పేజీల తాజా పాలసీ ప్రకారం థర్డ్‌ పార్టీ వర్క్‌సైట్‌లో ఎంత కాలం పనుంటే అంత కాలానికే హెచ్‌-1బీ వీసాలు జారీ చేస్తారు. ఇప్పటిదాకా మూడేళ్ల కాలానికి హెచ్‌-1బీ వీసాల్ని జారీచేస్తుండగా. ఇక నుంచి అంతకంటే తక్కువ కాలానికే జారీ చేయనున్నారు. 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌-1బీ వీసా దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభం కానుందన్న వార్తల నేపథ్యంలో ఈ పాలసీని కొత్తగా అమెరికా తెరపైకి తెచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com