విశాఖలో కన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా (సిఐఐ) రెండో రోజు సదస్సు ప్రారంభం
- February 25, 2018
- టెక్నాలజీస్ ఫర్ టుమారో అంశంపై ప్రసంగించిన సిఎం చంద్రబాబు
విశాఖ : విశాఖలో కన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా (సిఐఐ) రెండో రోజు సదస్సు ఆదివారం ప్రారంభమైంది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెక్నాలజీస్ ఫర్ టుమారో అనే అంశంపై ప్రసంగించారు. 2020 విజన్ రూపొందించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేశామన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం స్పష్టమైన విజన్ రూపొందించుకుని తదనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తున్నామని చెప్పారు. స్మార్ట్ పల్స్ సర్వేపై, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ హైబ్రిడ్ క్లౌడ్‌పై వివరించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ విధానంలో అన్ని వీధిదీపాలను పర్యవేక్షించవచ్చని, అన్ని మునిసిపల్ పట్టణాలతో అనుసంధానం చేస్తామని చెప్పారు. సిఎం కోర్ డ్యాష్ బోర్డు ద్వారా, రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షణ, ఎడ్యుటెల్.ఇన్ ద్వారా విద్యా బోధన, డ్రోన్ ఆధారిత సర్వే, ప్రతి పట్టణానికి డ్రోన్ పర్యవేక్షణ, గనులు, ట్రాఫిక్, అంతా డ్రోన్ ద్వారా వీక్షణ, భూగర్భ జలాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. పరిపాలనా విభాగాలన్నీ రియల్ టైమ్ గవర్నెన్స్ పరిధిలోకి తెచ్చామని చెప్పారు. దేశంలోనే వేగంగా వఅద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని, విభజన కష్టాలు ఎదుర్కొంటూనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాష్ట్ర విభజనతో తలెత్తిన కష్టనష్టాల నుంచి బయట పడటానికి 2022, 2029, 2050 విజన్ పెట్టుకున్నామని చెప్పారు. మూడున్నరేళ్లలో ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు ప్రచార ఉద్యమాలతో ముందుకు వెళ్తున్నామని, వీటి సాధనకు టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్, ఇ-ప్రగతి వంటి సాంకేతిక పరిజ్ఞానంతో పాలనను అనుసంధానించి ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా రూ.149కే రాష్ట్రంలో అన్ని గఅహాలను, గ్రామాలను ఇంటర్‌నెట్‌తో అనుసంధానిస్తున్నామని చెప్పారు. పీపుల్స్ హబ్ ఏర్పాటు చేసి ప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని నిర్వహిస్తున్నామని, ల్యాండ్ హబ్ ఏర్పాటు చేసి ఆధార్ తరహాలో భూదార్ తీసుకువచ్చామని, ప్రతి ఒక్కరి భూమికి యునిక్ ఐడీ కేటాయించి ఆ భూ రికార్డులను పారదర్శకంగా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నామని చెప్పారు. ఇ-ఆఫీసు, ఇ-కేబినెట్ తీసుకువచ్చామని, మార్చి నెలాఖరు కల్లా రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో కాగితం అవసరం లేని పాలన అందించాలనేది తమ ప్రయత్నమని చెప్పారు. డ్రోన్స్ కార్పొరేషన్ కలిగిన ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, డ్రోన్ల సాయంతో ఎంతో క్లిష్టమైన సర్వేలను రియల్ టైమ్‌లో జరపగలుగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ఖనిజ నిల్వలు, రహదారుల స్థితిగతులు డ్రోన్ కెమెరాల ద్వారా తెలుసుకోగలుగుతున్నామని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా వుంచామచి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టమ్ అమలు చేస్తున్నామని, ప్రతి శాఖకు పనితీరు సూచికలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఫైళ్ల క్లియర్స్ ప్రాతిపదికగా వివిధ శాఖలకు రేటింగ్స్ ఇస్తున్నామని, ఏపిలో ఫైళ్ల పెండింగ్ వుండకూడదని ప్రభుత్వం సంకల్పం తీసుకుందని చెప్పారు. కాల్ సెంటర్ ఏర్పాటు ద్వారా ప్రజా వినతులు, సమస్యలు సత్వరం పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇన్విజబుల్ గవర్నమెంట్, విజబుల్ గవర్నెన్స్ తమ విధానమని, రాష్ట్రంలో ప్రతి పౌరుడి సాధికారత, సంతఅప్తి తమ లక్ష్యమని పేర్కొన్నారు. వేదికపై ప్లానెట్-ఇ నెదర్లాండ్స్ సిఇఒ మార్జొలీన్ హెల్డర్, సోహమ్ ఇన్నోవేషన్ ల్యాబ్ వ్యవస్థాపక సిఇఒ నితిన్ శిశోడియా, కార్బన్ క్లీన్ సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ బండ్, ఆటంబెర్గ్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు శిబబ్రత దాస్, సెడిస్సీ ఐర్లాండ్ సిఇఒ రాబ్ లీస్లీ, లైట్నీర్ ఇన్ కార్పొరేషన్ ఫిన్లాండ్ సహ వ్యవస్థాపకుడు పీటర్ వెస్టిబ్రాకా తదితరులు ఆశీనులయ్యారు.
శ్రీదేవికి సిఐఐ భాగస్వామ్య సదస్సు ఘన నివాళి :
సదస్సు రెండోరోజు సెషన్లో ఒక నిమిషం మౌనం పాటించి శ్రీదేవి మృతికి సీఐఐ భాగస్వామ్య సదస్సు సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి