శ్రీదేవి కి 'అక్షరమాల' తో శ్రద్ధాంజలి ఘటించిన సిరాశ్రీ
- February 25, 2018
శ్రీదేవి:
ఆమె ఒక భూలోక తార
ఆమెది చందమామని మించిన అందం
అందమైన అమ్మాయిని తనతో కాకుండా
ఆమెతో పోల్చుతుంటే చందమామ అలిగేవాడు!
ఇప్పుడు ఆ తార ఎగిరిపోయింది-
చంద్రుడికి కూడా కనపడనంత పైకి!
దేవుడు అర్థంకాడు...
54 ఏళ్లకే ఆగిపోయే గుండెని ఆమెకు పెట్టాడు!
ప్రశాంతంగా నిద్రపోయిన ఎందరినో నిద్రలేవగానే భయపెట్టాడు!
ఆమెకి సునాయాసమరణం ఇచ్చాడు;
కోట్లాది మందిని భయంతో కుదిపేశాడు!
ఎప్పుడో పాతికేళ్ల తర్వాత జరగాల్సిన విషయాన్ని
అప్పుడే జరిపించేసాడు!
అయితేనేం?
బ్రతికుండగానే ఆమెకు హృదయాల్లో గుళ్లు కట్టారు!
కేవలం ఆమె అందానికి కాదు-
ఆమెలోని కళాదేవతకి
ఆమెలోని అమాయకపు నవ్వుకి
ఆమెలోని హుందాతనానికి
ఆమెలోని అలౌకిక తేజస్సుకి..
ఆమె సశరీరంగా లేకపోతేనేం?
ఈ గడ్డ మీద
చదువుకి సరస్వతి
సంపదకి లక్ష్మి
శక్తికి పార్వతి లాగ
అందానికి, అభినయానికి దేవత-
శ్రీదేవి
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి







