సిరియాలో వైమానిక దాడులు నిలిపివేత

- February 25, 2018 , by Maagulf
సిరియాలో వైమానిక దాడులు నిలిపివేత


*తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన భద్రతా మండలి 
ఐక్యరాజ్యసమితి: అంతర్యుద్ధం కారణంగా ఇక్కట్ల పాలవుతున్న ప్రజలను ఆదుకునేందుకు వీలుగా 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలంటూ సిరియాలో ప్రభుత్వ, తిరుగుబాటు వర్గాలను ఐక్యరాజ్యసమితి ఆదేశించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన ఎన్నికైన శాశ్వత సభ్యులు (ఇ10) బృందం మిగిలిన ఐదుగురు శాశ్వత సభ్యులపై వత్తిడి తెచ్చి ఏకగ్రీవంగా ఆమోదించేందుకు మార్గం సుగమం చేశారు. దీనితో సిరియాలో ఎటువంటిజాప్యమూ లేకుండా ఉభయ వర్గాలూ కాల్పు విరమణను పాటించాలని కోరుతున్న ఈ తీర్మానానికి మండలి ఏకగ్రవ ఆమోదం లభించింది. ఈ ప్రతిపాదనలపై దాదాపు రెండు రోజుల పాటు వాయిదాల పర్వం కొనసాగిన తరువాత కువైట్‌, స్వీడన్‌ వంటి దేశాల మద్దతుతో పి10 సభ్యదేశాల ప్రతినిధులు చర్చలుజరపటంతో రష్యాతో పాటు బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికాలు దీనికి అంగీకరించాయి. తీర్మానం మండలి ఆమోదం పొందిన అనంతరం అధ్యక్ష స్థానంలో ఉన్న కువైట్‌ ప్రతినిధి మన్సూర్‌ అయ్యద్‌ అల్‌ ఒతైబీ మీడియాతో మాట్లాడుతూ 'మండలి ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించటంతో ఏడేళ్ల ఈ ఘర్షణలకు తెరదించిన రాజకీయ పరిష్కార సాధనకు మార్గం సుగమమవుతుందని ఆశిస్తున్నామ'ని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com