కుమార్తె తప్పునకు ఎమిరాటీ తండ్రి ట్రాఫిక్ జరిమానా చెల్లింపు

- February 25, 2018 , by Maagulf
కుమార్తె తప్పునకు ఎమిరాటీ తండ్రి  ట్రాఫిక్ జరిమానా చెల్లింపు

షార్జా :  నిజాయితీ ఎల్లప్పుడూ అత్యుత్తమ విధానంగా ఉంటుంది, యూఏఈ లో ఒక తండ్రి ఇంకా నిజాయితీ   నిలబడి ఉందని రుజువు చేశారు. ఇటీవల, తన నంబర్ ప్లేట్ సరిగ్గా చూపకుండా  ట్రాఫిక్ ఉల్లంఘనకు తన కుమార్తె పాల్పడిందని గ్రహించి తనంతట తానుగా పోలీసుల వద్దకు వచ్చి ఓ ఎమిరాటీ తండ్రి నిజాయితీగా     జరిమానా చెల్లించారు. షార్జా పోలీస్ జనరల్ డైరెక్టరేట్ అజ్మాన్ అలీ అల్ థాహిరి ఈ సందర్భంగా మాట్లాడుతూ .తన కుమార్తె చేసిన ఉల్లంఘన కోసం 'ట్రాఫిక్ జరిమానా' సరిదిద్దడానికి ఆ తండ్రి చేసిన చర్య 'సరియైనది' అని పేర్కొన్నారు. ఆ కుమార్తె వేరే నెంబర్ ప్లేట్ తో ట్రాఫిక్ పోలీసుల ఎదుట నుంచి వేగంగా వెళ్లిపోవడంతో ఆ కారు నెంబర్ నమోదు చేశారు. అసలు వాహనం కాక నెంబర్ ప్లేట్ వేరేది కావడంతో తప్పుగా నమోదు చేశారు . దేంతో వేరే అమాయక వాహనకారుడు ఆ అమ్మాయికి బదులుగా జరిమానా విధించారు. అయితే నిజాయితీ గల తండ్రి తన కుమార్తె చేసిన పొరపాటును సరిచేసేందుకు నేరుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన కుమార్తె వేరే ఎవరో నెంబర్ షార్జా పోలీస్ జనరల్ డైరెక్టరేట్ వద్ద సమగ్ర పారిశ్రామిక పోలీస్ స్టేషన్ చీఫ్ కల్నల్ అబ్దుల్లా అలై ల్ నక్బి ఆ తండ్రి  నిజాయితీ సంజ్ఞను ప్రశంసించాడు. షార్జాలోని మ్యువిలె ప్రాంతంలో "పొరపాటు" చేసినట్లు తన కుమార్తె చెప్పినట్లు అల్ తాహిరి చెప్పారు.తప్పుగా నమోదైన నెంబర్ ప్లేట్ స్థానంలో తన కుమార్తె యొక్క నెంబర్ ప్లేట్ ను నమోదు చేయాలనీ ఆ తండ్రి  పోలీసులను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com