కుమార్తె తప్పునకు ఎమిరాటీ తండ్రి ట్రాఫిక్ జరిమానా చెల్లింపు
- February 25, 2018
షార్జా : నిజాయితీ ఎల్లప్పుడూ అత్యుత్తమ విధానంగా ఉంటుంది, యూఏఈ లో ఒక తండ్రి ఇంకా నిజాయితీ నిలబడి ఉందని రుజువు చేశారు. ఇటీవల, తన నంబర్ ప్లేట్ సరిగ్గా చూపకుండా ట్రాఫిక్ ఉల్లంఘనకు తన కుమార్తె పాల్పడిందని గ్రహించి తనంతట తానుగా పోలీసుల వద్దకు వచ్చి ఓ ఎమిరాటీ తండ్రి నిజాయితీగా జరిమానా చెల్లించారు. షార్జా పోలీస్ జనరల్ డైరెక్టరేట్ అజ్మాన్ అలీ అల్ థాహిరి ఈ సందర్భంగా మాట్లాడుతూ .తన కుమార్తె చేసిన ఉల్లంఘన కోసం 'ట్రాఫిక్ జరిమానా' సరిదిద్దడానికి ఆ తండ్రి చేసిన చర్య 'సరియైనది' అని పేర్కొన్నారు. ఆ కుమార్తె వేరే నెంబర్ ప్లేట్ తో ట్రాఫిక్ పోలీసుల ఎదుట నుంచి వేగంగా వెళ్లిపోవడంతో ఆ కారు నెంబర్ నమోదు చేశారు. అసలు వాహనం కాక నెంబర్ ప్లేట్ వేరేది కావడంతో తప్పుగా నమోదు చేశారు . దేంతో వేరే అమాయక వాహనకారుడు ఆ అమ్మాయికి బదులుగా జరిమానా విధించారు. అయితే నిజాయితీ గల తండ్రి తన కుమార్తె చేసిన పొరపాటును సరిచేసేందుకు నేరుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన కుమార్తె వేరే ఎవరో నెంబర్ షార్జా పోలీస్ జనరల్ డైరెక్టరేట్ వద్ద సమగ్ర పారిశ్రామిక పోలీస్ స్టేషన్ చీఫ్ కల్నల్ అబ్దుల్లా అలై ల్ నక్బి ఆ తండ్రి నిజాయితీ సంజ్ఞను ప్రశంసించాడు. షార్జాలోని మ్యువిలె ప్రాంతంలో "పొరపాటు" చేసినట్లు తన కుమార్తె చెప్పినట్లు అల్ తాహిరి చెప్పారు.తప్పుగా నమోదైన నెంబర్ ప్లేట్ స్థానంలో తన కుమార్తె యొక్క నెంబర్ ప్లేట్ ను నమోదు చేయాలనీ ఆ తండ్రి పోలీసులను కోరారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి