న్యూగునివాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రత

- February 25, 2018 , by Maagulf
న్యూగునివాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రత

మెండీ: న్యూగునివాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రత నమోదైంది. సోమవారం తెల్లవారు జామునే ఈ ప్రమాదం వాటిల్లింది. భూకంపకేంద్రం భూమి లోపల 35 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

దక్షిణ హైలాండ్‌కు రాజధాని ప్రాంతంగా ఉన్న మెండీకి సమీపంలో భూకంపం వాటిల్లింది. ఈ ప్రాంతంలో సుమారు 50 వేల మంది జనాభా నివసిస్తున్నారు.

భూకంప తీవ్రతతో స్థానికులు భయాందోళనలు చెందారు. ఇళ్ళలో నుండి పరుగులు తీశారు.సుమారు 40 సెకండ్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com