నేడు స్వదేశానికి శ్రీదేవి పార్తీవదేహం
- February 25, 2018
ప్రముఖ బాలీవుడ్ నటి శ్రీదేవి దుబాయ్‌లోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్‌లో హఠాన్మరణం చెందిన సంగతి తెల్సిందే. శనివారం రాత్రి 11 గంటలకు ఆమె మరణించగా, ఆమె మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఆసుపత్రి వెలుపల ఆమె మరణించిన దరిమిలా, డెత్ సర్టిఫికెట్ తదితర విషయాల కోసంగాను ఆమె మృతదేహం తరలింపు ఏర్పాట్లు కొంతమేర ఆలస్యమవుతున్నాయి. వాష్‌రూమ్‌లో ఆమె హఠాత్తుగా సంభవించిన గుండెపోటుతో మరణించినట్లు ప్రాథమికంగా తెలియవస్తోంది. పూర్తి వివరాలు డెత్ రిపోర్ట్‌లో వెల్లడి కానున్నాయి. ఇండియన్ కాన్సులేట్, శ్రీదేవి పార్తీవ దేహాన్ని ఇండియాకి తరలించే ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. కాస్సేపట్లో ఆమె మృతదేహం ఇండియాకి ప్రత్యేక విమానంలో బయల్దేరనుంది.
తాజా వార్తలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్‌లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్‌కు అవకాశం







