ఆఖరి క్షణాల్లో శ్రీదేవి ఏం చేసిందంటే..
- February 25, 2018
ఇండియన్ సినిమా స్క్రీన్‌పై తొలి లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న శ్రీదేవి, శనివారం అర్థరాత్రి దుబాయ్‌లో తుది శ్వాస విడిచారు. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వచ్చిన శ్రీదేవి, హఠాన్మరణం చెందడం అందర్నీ కలచివేస్తోంది. చనిపోవడానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగిందనే విషయానికి సంబంధించి పూర్తి స్పష్టత లేకపోయినా, డిన్నర్‌కి రెడీ అయ్యే సందర్భంలో వాష్ రూమ్‌కి వెళ్ళిన శ్రీదేవికి అక్కడే గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. అందకు ముందు భర్త బోనీ కపూర్‌తో కలిసి కాస్సేపు ముచ్చటించిన శ్రీదేవి, వాష్‌రూమ్‌కి వెళ్ళారనీ, అయితే 15 నిమిషాలు దాటినా వాష్‌రూమ్‌లోంచి ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త బోనీకపూర్, ఆమె కోసం వాష్‌రూమ్‌లోకి వెళ్ళి చూస్తే, అక్కడ బాత్ టబ్‌లో అచేతనావస్థలో ఆమె పడి ఉందనీ, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందారనీ తెలుస్తోంది. నెఫ్యూ మొహిత్ మార్వా వివాహ వేడుక కోసం బోనీకపూర్, శ్రీదేవి, వారి కుమార్తె ఖుషీ దుబాయ్ వచ్చారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి