సాయంత్రానికి ముంబై చేరనున్న శ్రీదేవి పార్థివ దేహం

- February 25, 2018 , by Maagulf
సాయంత్రానికి ముంబై చేరనున్న శ్రీదేవి పార్థివ దేహం

ప్రముఖ నటి శ్రీదేవి గుండెపోటుతో దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే. పోస్ట్ మోర్టమ్ నిర్వహించిన అనంతరం ఆమె పార్థివ దేహాన్ని మార్చరీలో భద్రపరిచారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించే నివేదికతో ఆమె పార్థివ దేహాన్ని ఇండియా కు తరలించే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన అనంతరం జరిగే ప్రక్రియ:

అధికారులు ఇచ్చే డెత్ సర్టిఫికెట్ ను కుటుంబ సభ్యులు ఇండియన్ కాన్సులేట్ లో అందజేయగా కాన్సులేట్ బృందం శ్రీదేవి పాస్పోర్ట్ ను రద్దు చేస్తుంది. మరియు ఆమె పార్థివ దేహాన్ని ఎంబామ్ (రాసానాలు పూయుట) కై తరలించెదరు. ఇమ్మిగ్రేషన్ వారు మిగతా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పోలీసు డిపార్ట్మెంట్ మరియి న్యాయవాది 'నో అబ్జెక్షన్' పత్రాలు ఇవ్వగానే పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో ముంబై కి తరలిస్తారు. 

ఫోరెన్సిక్ రిపోర్ట్ దుబాయ్ కాలమానం ప్రకారం 11 గంటల సమయంలో రావచ్చని భావిస్తున్నారు. అనంతరం ఎంబామ్ ప్రక్రియ ఒక గంటన్నర సమయం పడుతుంది కాగా పార్థివ దేహాన్ని ముంబై తరలించటం 1 గంటకు అవ్వచ్చని అంచనా. సాయంత్రానికి శ్రీదేవి పార్థివ దేహం ముంబై కి చేరుతుందని, సమయానుకూలంగా నేటి సాయంత్రం లేదా మరుసటి ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com