తన పెళ్లికి ఆటంకంగా మారిన తండ్రిపై కోర్టులో కూతురి పిటీషన్..

- February 26, 2018 , by Maagulf
తన పెళ్లికి ఆటంకంగా మారిన తండ్రిపై కోర్టులో కూతురి పిటీషన్..

అబుదాబి:  మా  ప్రేమ పెళ్ళికి నా తండ్రే కదా విలనూ అంటూ  న్యాయస్థానంను ఆశ్రయించిందా ఓ అరబ్బు  యువతీ. దీనిపై సమగ్ర విచారణ జరిపిన ఓ షరియా కోర్టు సంచాలన తీర్పు వెలువరించింది. యూఏఈలోని అబుదాబి నగరంలో   తన మనస్సుకి నచ్చిన ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటే తన తండ్రి నిరాకరిస్తున్నాడని, అభ్యంతరం తెలుపుతున్నాడని ఓ యువతి కోర్టును ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలంటూ పిటీషన్‌లో కోరింది. వయసు భేదం, నిరుద్యోగం తండ్రి పేర్కొంటున్న ఈ రెండు కారణాలతో కూతురు ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దనే హక్కు కన్నా తండ్రయినప్పటకీ నిలువరియించె హక్కు  లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది  యువతి, యువకుడి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్నామని, వారిద్దరి పెళ్లిని వ్యతిరేకించడానికి సరైన కారణాలు లేవని న్యాయస్థానం పేర్కొంది. యువతి కోరుకుంటున్న వ్యక్తి నైతిక విలువలు పాటిస్తాడని తేలిందని, వారిద్దరూ సంతోషంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని, కూతురి నిర్ణయాన్ని తండ్రి పెద్ద మనస్సుతో అంగీకరించాలని  ఆదేశించింది. ఇదిలావుండగా పెళ్లి చేసుకుంటాననే మనసులోని మాటను తాను ఇష్టపడుతున్న వ్యక్తి అనేకసార్లు చెప్పాడని, కానీ తండ్రి అంగీకరించకపోవడంతో అనేక ప్రయత్నాలు చేశానని, చివరి ప్రయత్నంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించానని యువతి చెప్పింది. షరియా కోర్టు తీర్పుని సంతోషంతో స్వాగతించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com