అక్కా నాబిడ్డని నువ్వే చూసుకో.. సోదరికి మెసేజ్

- February 26, 2018 , by Maagulf
అక్కా నాబిడ్డని నువ్వే చూసుకో.. సోదరికి మెసేజ్

అక్కా నాబిడ్డని నువ్వే చూసుకో.. నేను వెళ్లి పోతున్నాను.. ఈ బాధల్ని భరించలేను.. అంటూ అమెరికాలో ఉన్న తన సోదరికి మెసేజ్ పెట్టి ఉరి వేసుకుని తనువు చాలించింది ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి. కర్ణాటకలోని కోలారు జిల్లాకు చెందిన రశ్మీ, బెంగుళూరుకు చెందిన సతీష్‌ ప్రేమించుకున్నారు. మూడు సంవత్సారల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇద్దరూ సాప్ట్ వేర్ ఉద్యోగులుగా ప్రముఖ కంపెనీల్లో పని చేస్తున్నారు.  అనంతరం బాబు పుట్టాడు. ఈ నేపద్యంలో శనివారం సతీష్ భార్యని, బాబుని వదిలి కోలూరు జిల్లాలోని సొంత ఊరుకు వెళ్లాడు. ఆ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు రశ్మి అమెరికాలో ఉన్న సోదరికి మెసేజ్ పెట్టింది. బాబుని జాగ్రత్తగా చూసుకోమంటూ. మెసేజ్ చూసిన వెంటనే బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉంటున్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి అర్జెంటుగా చెల్లి దగ్గరకు వెళ్లమంటూ చెప్పింది. తల్లి దండ్రులు చేరుకునే లోపే రశ్మి సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురి మృతికి అల్లుడు, అత్తే కారణమంటూ తల్లి ఆరోపణలు చేస్తోంది. వరకట్న వేధింపుల వల్లే మరణించిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com