మహిళా ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ శుభవార్త
- February 26, 2018
న్యూఢిల్లీ : మహిళా ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ శుభవార్త అందించింది. నిరుపయోగ సీట్ల (అన్‌యుటిలైజ్డ్ బెర్తులు) విషయంలో మహిళా కోటాను అమలు చెయ్యబోతోంది. దీని ప్రకారం రిజర్వేషన్ తర్వాత మిగిలిపోయిన సీట్లలో తొలి ప్రాధాన్యం మహిళలకు ఉంటుంది.
సాధారణంగా రైల్వే శాఖ రిజర్వేషన్ ఛార్ట్ తయారు చేసే సమయంలో సీట్లు మిగిలిపోతే వెయిట్-లిస్ట్‌లో ఉన్నవారికి కేటాయిస్తుంది. కోటా ప్రకారం తొలి ప్రాధాన్యం సీనియర్ సిటిజన్లకు.. తర్వాతి ప్రాధాన్యం ముందుగా ఎవరు బుక్ చేసుకునే వారికి ఉంటుంది. కానీ, ఇకపై ఆ జాబితాలో ముందుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ మేరకు ఫిబ్రవరి 15న రైల్వే బోర్డు ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది.
బెర్తులు మిగిలిపోయే సమయంలో సీట్ల కేటాయింపును లింగ నిష్పత్తి ద్వారానే కేటాయించాలని సర్క్యులర్‌లో పేర్కొంది. ముందు వృద్ధులకు, తర్వాత మహిళలకు సీట్లు కేటాయించాలి. త్వరలోనే ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ప్రస్తుతం అన్ని రైళ్లలో ఆరు లోయర్ బెర్తులు, ఏసీ3 టైర్-ఏసీ2 టైర్ లలో మూడు లోయర్ బెర్తులను సీనియర్‌సిటిజన్లు, మహిళా ప్రయాణికులు (45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే), గర్భవతులకు కేటాయిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







