మార్చి 5 నుంచి 'సైరా' సెకండ్ షెడ్యూల్
- February 26, 2018
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి రెండో షెడ్యూల్ చిత్రీకరణ మార్చి అయిదో తేది నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం కొద్దిరోజుల విరామం తర్వాత రెండో షెడ్యూల్‌కు సమాయత్తమవుతోంది. హైదరాబాద్ లోనే ఈ రెండో షెడ్యూల్ జరగనుంది.. ఈ షెడ్యూల్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, నయనతార, చిరంజీవి మధ్య కీలకసన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ చిత్రంలో నరసింహారెడ్డి పాత్రను పోషిస్తున్న చిరంజీవికి గురువు అయిన గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి రామ్ చరణ్ నిర్మాత.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు..
కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ సమర్పణలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో , జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నాజర్, రవికిషన్, ముఖేష్‌రుషి, రఘుబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, వి.జయప్రకాష్, రఘు కారుమంచి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కథ, పరుచూరి బ్రదర్స్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, రచనా సహకారం: సత్యానంద్, భూపతిరాజా, డి.ఎస్.కన్నన్, మధుసూదన్, వేమారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వాకాడ అప్పారావు, వి.వై.ప్రవీణ్‌కుమార్.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







