లైంగిక వేధింపులు: బాస్‌ని హత్య చేసిన వ్యక్తి
- February 26, 2018
కంపాట్రియేట్ మేనేజర్ని హత్య చేసిన ఘటనలో ఓ వ్యక్తికి న్యాయస్థానం ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయ్యాక, దేశం నుంచి అతన్ని డిపోర్ట్ చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. 22 ఏళ్ళ పాకిస్తానీ కార్మికుడు, తన పై అధికారి అయిన సూపర్వైజర్పై దాడి చేశాడు. ఆ దాడికి కారణం, సూపర్వైజర్ లైంగికంగా పాకిస్తానీ కార్మికుడ్ని దూషించడమే. ఘటన వివరాల్ని తెలియజేస్తూ, ఒక రోజు తన బాస్ తనని పార్కింగ్ లాట్లో కలిశారనీ, తన పట్ల లైంగిక వాంఛని అతని వ్యక్తం చేయగా, దాన్ని తాను తిరస్కరించాననీ, ఈ నేపథ్యంలో అతను తనను అవమానించడమే కాక, బెదిరింపులకు దిగాడనీ, ఆ తర్వాత తాను సూపర్ మార్కెట్ వద్దకు వెళ్ళి కత్తిని కొనుగోలు చేశాననీ, కార్ పార్కింగ్ ఏరియాలో ఇంకోసారి తనను చూసిన బాస్, తన మీద లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆగ్రహం తట్టుకోలేక అతన్ని పొడిచానని నిందితుడు చెప్పాడు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..







