గల్ఫ్ సంక్షోభానికి పరిష్కారం చూపుతానంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్

- February 26, 2018 , by Maagulf
గల్ఫ్ సంక్షోభానికి పరిష్కారం చూపుతానంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్

యూఏఈ : గల్ఫ్ లో గత కొన్నాళ్లుగా నెలకొని ఉన్న రాజకీయ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు అమెరికా పెద్దన్నయ్య రంగంలోనికి దిగనున్నాడు. సౌదీఅరేబియా, యూఏఈ, ఖతార్ సీనియర్ నేతలతో అమెరికా అధ్యక్షుడు ప్రత్యేకంగా సమావేశమవనున్నారు. సౌదీ క్రౌన్‌ప్రిన్స్, వైస్‌ ప్రెసిడెంట్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్స్, డిఫెన్స్ మినిస్టర్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్ధులజీజ్, క్రౌన్‌ప్రిన్స్ ఆఫ్ ది అబుదాబి, డిప్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యన్, ఖతార్ అమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్‌థానీలు మార్చి, ఏప్రియల్ నెలల్లో అమెరికాకు వెళ్లనున్నారు.  వీరిఅందరితో అధ్యక్షుడు ట్రంప్‌ చర్చించనున్నారు. సంక్షోభ పరిష్కారం దిశగా చర్చించనున్నారని అమెరికా లోని వైట్‌హౌస్ అధికారులు పేర్కొంటున్నారు. ఉగ్రవాదం భుజానికి ఎత్తుకున్న దేశానికి మద్ధతిస్తూ వారికోసం పెద్ద ఎత్తున నిధులు సమీకరిస్తూ మరోవైపు బద్ధ శత్రువైన ఇరాన్‌తో స్నేహం చేస్తోన్న ఖతార్‌తో తాము దౌత్య బంధాలను కొనసాగించలేమని పలు గల్ఫ్ దేశాలు గత ఏడాది జూన్ నెలలో ఖతార్ దేశంని దూరంగా ఉంచుతున్నారు. రవాణా, వాణిజ్య, భద్రతపరమైన బంధాలు కొనసాగించబోమని తేల్చిచెప్పాయి. మధ్యలో కొన్ని చర్చలు జరిగినప్పటికీ బంధాల పునరుద్ధరణ జరగలేదు. ఇప్పుడు అమెరికా వీరి మధ్య సయోఖ్యతని నెలకొల్పడానికి కృషి చేస్తానని పేర్కోవడం విశేషం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com