పాతవారిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని సౌదీ రాజు సల్మాన్ సంచలన నిర్ణయం
- February 27, 2018
రియాద్:సౌదీ రాజు సల్మాన్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఆర్మీ చీఫ్ కమాండర్ పదవి నుండి అబ్దుల్ రహమాన్ బిన్ సలేహ్ అల్ బునియాన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకొన్నాడు. ఈ మేరకు సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకటించింది.
రహమాన్ స్థానంలో ఫయ్యాద్ అలీ రువాలీని నియమిస్తూ సౌదీ రాజు నిర్ణయం తీసుకొన్నాడని ప్రకటించింది.అంతేకాదు భూ, వైమానిక దళాలకు చెందిన సైన్యాధిపతులను కూడ రాజు ఇతరులతో భర్తీ చేశారు. పాతవారిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించారు.
అయితే రక్షణ విభాగంలో కీలకమైన మార్పులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన మాత్రం ఇవ్వలేదు. ఎందుకు వారికి మార్చాల్సి వచ్చిందనే విషయమై ప్రకటించలేదు.సౌదీ రాజు కుమారుడు రక్షణ మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది.
ప్రస్తుతం సౌదీ దళాలు యెమెన్ యుద్ధంలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆకస్మిక నిర్ణయం సంచలనం కలిగించింది. యెమెన్లో రెబల్స్ తరపున సౌదీ దళాలు పోరాటం చేస్తున్నాయి. దాదాపు మూడేళ్లుగా యెమెన్లో అంతర్యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. సౌదీలో జరిగిన ఆకస్మిక పరిణామాలకు అరబ్ దేశాలు ఆశ్చర్యపడుతున్నాయి
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..