సౌదీ అరేబియా లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడటం నిషేధం

- February 27, 2018 , by Maagulf
సౌదీ అరేబియా లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడటం నిషేధం

రియాద్ : సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై నిషేధం విధించినా, భారీ జరిమానాలు వసూలు చేస్తున్నా, జైళ్లకు పంపుతున్నా వాహన చోదకుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడే వ్యక్తులపై  సోమవారం నుంచి ఎలక్ట్రానిక్ సాంకేతిక పరికరాలతో పర్యవేక్షిస్తారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ (మురోర్) మంగళవారం ప్రకటించింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ను తాకిన చాలు ట్రాఫిక్ ఉల్లంఘన కింద పరిగణిస్తారు. మొదటి నేరంగా పరిగణిస్తూ అందుకు జరిమానాగా 150 సౌదీ రియళ్ళు  విధిస్తారు. అదే విధంగా మరలా  ఉల్లంఘించినవారికి 24 గంటలలో 300 సౌదీ రియళ్ళను మరోమారు జరిమానా వసూలు చేస్తారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ (మురోర్) తెలిపారు. అలాగే వాహనాలలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ సైతం ధరించని వారని సైతం సోమవారం నుంచి ఎలక్ట్రానిక్ నిఘా ద్వారా పర్యవేక్షిస్తారు ఆ డ్రైవర్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.మొబైల్ ఫోన్లను వాడుతున్న వాహనాలను గుర్తించటానికి రోడ్ల వైపుగా  నిఘా కెమెరాలని ట్రాఫిక్ డిపార్టుమెంటులు  ఏర్పాటు చేశాయి, పలు అధ్యయనాల్లో గమనించినదేమిటంటే  వాహనాలు నడుపుతున్నప్పుడు ఈ ఉల్లంఘన కారణంగా ప్రమాదాలు జరగడానికి ప్రధాన అంశంలో ఒకటి అని కనుగొన్నారు. ఈ నిఘా కెమెరాలు సైతం సీట్ బెల్ట్ పెట్టుకోనివారినై వాహనదారులు గుర్తించడం జరుగుతుంది.రియాద్ లోని కింగ్ అబ్దుల్లా మెడికల్ రీసెర్చ్ సెంటర్ గత ఏడాది నిర్వహించిన ఒక అధ్యయనంలో, రాజధాని నగరంలో 13.8 శాతం మంది వాహనాలు మొబైల్ ఫోన్లను డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఉపయోగించినట్లు తెల్సింది. పరిశోధకులు రాజధాని నగరంలోని ఎక్స్ ప్రెస్ దారులలో, అంతర్గత రోడ్లపై 13 ప్రధాన ట్రాఫిక్ జోన్లలో మొత్తం 1,700 కార్లుని గుర్తించారు. రియాద్ లో 2015 లో దాదాపు ఐదు లక్షల కార్లు ఉన్నట్లు అంచనా. సౌదీ అరేబియా రాజ్యంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com