తెలంగాణ మిస్‌ ఇండియా ఆడిషన్స్‌

- February 27, 2018 , by Maagulf
తెలంగాణ మిస్‌ ఇండియా  ఆడిషన్స్‌

సోమాజిగూడ: మిస్‌ ఇండియా తెలంగాణ ఆడిషన్స్‌ సందడిగా జరిగాయి. ఇటీవల ప్రాంతీయ అధికారిగా ఈ సంస్థకు బాధ్యతలు చేపట్టిన మమతా త్రివేది కార్యక్రమ వివరాలు వెల్లడించారు. అందం, వయసుతో నిమిత్తం లేకుండా జ్ఞాపకశక్తి, సామాజిక దృక్పథం గల వివాహిత మహిళలకు ఏర్పాటుచేసిన తొలి ఆడిషన్స్‌ ఉత్సాహంగా జరిగినట్లు తెలిపారు. పిలుపునిచ్చిన కొద్ది రోజుల్లోనే 80 మంది దరఖాస్తు చేసుకోగా వారికి మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా సోమాజిగూడలోని ది పార్కు హోటల్‌లో ఆడిషన్స్‌ నిర్వహించారు. క్యాట్‌వాక్‌, ఇంటర్వ్యూ, టాలెంట్‌లపై ఆడిషన్స్‌ కొనసాగాయని సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మమతా త్రివేది వెల్లడించారు. మిసెస్‌ విభాగంలో 20-40ఏళ్లు, క్లాసిక్‌ విభాగంలో 40-60 ఏళ్లు, సూపర్‌ క్లాసిక్‌ విభాగంలో 60ఏళ్లపైబడి వయసు వారికి అవకాశం కల్పించారు. 64 ఏళ్ల అన్నపూర్ణ అనే మహిళ మిస్‌ ఇండియా తెలంగాణ స్థానంకోసం పోటీ పడటం విశేషం ఈ కార్యక్రమానికి ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డి అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆంగ్లమే అని కాకుండా మాతృభాషలోనూ ఇంటర్వ్యూలో పాల్గొనేలా అవకాశం కల్పించడం శుభపరిణామమని, దీని ద్వారా మహిళా సాధికారతకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com