కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం

- February 27, 2018 , by Maagulf
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం

చెన్నై: కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూశారు.అనారోగ్యంతో కాంచీపురం ఏబీసీడి ఆసుపత్రిలో మంగళవారం నాడు చేరారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి బుధవారం ఉదయం పూట మరణించారు. శ్వాసకోశ వ్యాధితో ఇబ్బందిపడుతున్నారు. పలు మార్లు ఆయన అస్వస్థతకు గురౌతున్నాడు.

కంచి పీఠానికి 1994 జనవరి 3 నుండి జయేంద్ర సరస్వతి పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. సుదీర్ఘంగా ఆయన పీఠాధిపతిగా కొనసాగుతున్నాడు. జయేంద్ర సరస్వతి వయస్సు 82 ఏళ్ళు.

1935 జూలై 18వ తేదిన తంజావూరు జిల్లాలో కంచి జయేంద్ర సరస్వతి జన్మించారు. అనారోగ్యం కారణంగానే శిష్య బృందానికి పీఠాన్ని అప్పగించాలని భావించారని చెబుతున్నారు.

జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రమణ్య అయ్యర్. 1954 మార్చి 24న, జయేంద్ర సరస్వతిగా మారారు. కంచి పీఠానికి 69వ, పీఠాధిపతిగా జయేంద్ర సరస్వతి కొనసాగుతున్నారు.

శంకర్ రామన్ హత్య కేసులో జయేంద్ర సరస్వతి జైలుకు వెళ్ళాడు. అయితే ఆ కేసులో జయేంద్ర సరస్వతి నిర్ధోషిగా విడుదలయ్యారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జయేంద్ర సరస్వతి శంకర్రామన్ హత్య కేసులో అరెస్టయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com