త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆర్మీ అధికారిగా ఎన్టీఆర్..

- February 27, 2018 , by Maagulf
త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆర్మీ అధికారిగా ఎన్టీఆర్..

జై లవకుశ తర్వాత ఎన్టీఆర్‌ చాలా గ్యాప్‌ తీసుకున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించే చిత్రానికి కేవలం పూజా కార్యక్రమాలు మాత్రమే జరిగాయి. ఆ సమయంలో త్రివిక్రమ్‌ అజ్ఞాతవాసి బిజీలో ఉన్నారు.
ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమాపైనే దృష్టిపెట్టారు త్రివిక్రమ్‌. అజ్ఞాతవాసి పరాజయం తర్వాత ఈ సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి. అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సినిమా ఉంటుందా లేదా అనే సందిగ్దత నెలకొంది. అయితే కేవలం ఒక ఫ్లాప్‌తో దర్శకుడి ప్రతిభను తక్కువ చేయలేరు. సినీరంగంలో జయాపజయాలు అతి సహజం. ఈ విషయం ఎన్టీఆర్‌కు తెలియంది కాదు.
ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌ మార్చి మూడవ వారంలో మొదలవుతుందని తెలిసింది. ఇందులో ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో ఎన్టీఆర్‌ కనిపిస్తారని అంటు న్నారు. సినిమాకు నేపథ్యం కూ డా ఆర్మీ కావడం విశేషం. ఆర్మీ పాత్ర కోసం ఎన్టీఆర్‌ ఇప్పటికే కొంత పరిశీలన చేసి జాగ్రత్తలు తీసుకున్నారని, కొత్త లుక్‌తో కనిపిస్తారని యూనిట్‌ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం వివరాలు వెల్లడి కాలేదు. హీ రోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుందని తెలిసింది. 
హారిక హాసిని పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్‌ స్వరరచన చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com