హజ్‌ యాత్రికులకు గుడ్ న్యూస్

- February 27, 2018 , by Maagulf
హజ్‌ యాత్రికులకు గుడ్ న్యూస్

ఢిల్లీ : హజ్‌ యాత్రికులకు శుభవార్త. హజ్‌ యాత్రకు వెళ్లే ప్రయాణికులకు కేంద్రం చార్జీలను తగ్గించిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తెలిపారు. దీన్ని కీలక చర్యగా ఆయన అభివర్ణించారు. మైనార్టీల సాధికారత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, వారి బుజ్జగింపు కోసం కాదని అన్నారు. గత యుపిఎ ప్రభుత్వ హయాంలో హజ్‌ యాత్రికులను రాజకీయంగా, ఆర్థికంగా దోచుకున్నారని, తాజా నిర్ణయంతో ఆ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని నఖ్వీ పేర్కొన్నారు. ఎయిర్‌ ఇండియా, సౌదీ ఎయిర్‌లైన్స్‌ అండ్‌ ఫ్లైనాస్‌, సౌదీ అరేబియాకు చెందిన ఒక విమానంలో ప్రయాణించే యాత్రికులకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. అహ్మదాబాద్‌ నుంచి హజ్‌ యాత్రకు వెళితే రూ.65,015 వసూలు చేస్తారు. ఇదే మార్గంలో 2013-14లో ఈ చార్జీ రూ.98,750గా ఉంది. ప్రస్తుతం ముంబై నుంచి హజ్‌కు ఉన్న రూ.98,750 చార్జీని రూ.57,857కు తగ్గించారు. హజ్‌ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో జనవరిలో రద్దుచేసిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com