జూన్ 14న దిల్‌రాజు, రాజ్ తరుణ్ ల `లవర్`విడుదల
- February 27, 2018
తొలి చిత్రం `ఊయ్యాల జంపాల`తో సక్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్. వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకులదరికీ చాలా దగ్గరయ్యారు. ఇప్పుడు సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారధ్యం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై `లవర్` సినిమాలో నటిస్తున్నారు. `అలా ఎలా?` వంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టకున్న దర్శకుడు అనీశ్ కృష్ణ, వెంటనే సినిమా చేసేయాలనే ఆలోచనతో కాకుండా హిట్ సినిమా తీయాలనే దృక్పథంతో వెయిట్ చేసి మంచి కథను తయారు చేసుకున్నారు. మంచి కథకు తగ్గట్లు టెస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు, యంగ్ హీరో తరుణ్ సినిమాకు చక్కగా కుదిరారు. ఈ సినిమా ప్రేమలోకి కొత్త కోణాలను టచ్ చేసేలా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ద్వారా రిద్ది కుమార్ హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోన్న ఈ సినిమాను జూన్ 14న విడుదల చేయడానికి నిర్మాత దిల్‌రాజు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







