ఉగ్రవాదం పనిపట్టండి: అమెరికా

- February 27, 2018 , by Maagulf
ఉగ్రవాదం పనిపట్టండి: అమెరికా

ఉగ్రవాదం, ఉగ్రవాద కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని పాక్‌ను అమెరికా మరోసారి గట్టిగా హెచ్చరించింది. 'హక్కానీ నెట్‌వర్క్, మిగతా ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించడం మానేయండి. ఆ సంస్థలకు ఆర్థిక చేయూతను ఇవ్వొదు. ఉగ్రవాదంపై ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకుని, చిత్తశుద్ధిని నిరూపించుకోండి' అని పాక్‌లోని అమెరికా ఎంబసీ స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడి డిప్యూటీ అసిస్టెంట్, యూఎస్ జాతీయ భద్రతా మండలి సీనియర్ డైరెక్టర్ (దక్షిణ, మధ్య ఆసియా) లీసా కర్టీస్ పాకిస్తాన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి తెహ్‌మీనా జంజౌ, దేశ వ్యవహారాల మంత్రి అసన్ ఇక్బల్, ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్ట్ఫా లెఫ్టినెంట్ జనరల్ బిలాల్ అక్బర్‌తో ఆమె భేటీ అయ్యారు. హక్కానీ నెట్‌వర్క్‌తోపాటు పలు ఉగ్రవాద సంస్థలను పీచమణచాలని యుఎస్ ఎంబసీ గట్టిగా చెప్పింది. ప్రపంచానికే ఉగ్రవాదం పెను సవాల్‌గా మారిందని, పాక్ భూ భాగం నుంచే ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతుండడం ఆందోళన కలిగించే అంశమని కర్టీస్ అన్నారు. అఫ్గనిస్తాన్‌లో హక్కానీ నెట్‌వర్క్ దురాఘతాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని ఎంబసీ ఆందోళన వ్యక్తం చేసింది. 

2008లో ఇండియన్ మిషన్‌పై దాడి చేసి 58 మందిని పొట్టనబెట్టుకుందని అన్నారు. అలాగే విదేశీ అధికారులను ఎందరినో కిడ్నాప్ చేయడం, దాడులకు పాల్పడడం జరుగుతోందని ఇదంతా హక్కానీ నెట్‌వర్క్, మిగతా ఉగ్రవాద సంస్థల పనేనని కర్టీస్ పాక్‌కు తెలిపారు. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించే పక్షంలో పాక్‌తో కొత్త సంబంధాలు ప్రారంభించాలని తాము భావిస్తున్నట్టు ఆమె వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com