భారీ టన్నల్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫైట్స్
- February 28, 2018
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆవేశపరుడైన ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అందుకు తగ్గట్టుగా సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. తాజాగా ఈ సినిమాలో కీలకమైన ఓ పోరాట సన్నివేశానికి సంబంధించిన అప్ డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్ చల్ చేస్తోంది.
విరామం సమయంలో వచ్చే ఈ సినిమా సన్నివేశం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ దగ్గర ఓ భారీ టన్నల్ సెట్‌ను నిర్మించారట. ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలట్‌గా నిలుస్తుందంటున్నారు చిత్రయూనిట్. బన్నీ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాను లగడపాటి శ్రీధర్, నాగబాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్‌లు స్వరాలందిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి