తగ్గిన బంగారం ధరలు
- February 28, 2018
వరుసగా నాలుగు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. నేటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 500 రూపాయల మేర కిందకి పడిపోయింది. 460 రూపాయలు నష్టపోయి రూ.31,390గా నమోదైంది. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో పాటు గ్లోబల్‌గా సంకేతాలు ప్రతికూలంగా వస్తుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో కేజీ వెండి ధర రూ.250 తగ్గి, రూ.39,300గా నమోదైంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు బలంగా ఉందని.. ఫెడ్ పాలసీ రేట్లను క్రమంగా పెంచుతుందని ఫెడరల్ రిజర్వు చైర్మన్ జీరోమ్ పావెల్ ప్రకటించడంతో, డాలర్‌కు సెంటిమెంట్ బలపడింది. దీంతో ఎంతో విలువైన ఈ మెటల్‌కి డిమాండ్ పడిపోయింది. మంగళవారం అంతర్జాతీయంగా బంగారం ధరలు 1 శాతం క్షీణించాయి. ఈ ఏడాది మూడు నుంచి నాలుసార్లు రేట్లను పెంచబోతున్నట్టు కూడా జీరోమ్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.460 చొప్పున పడిపోయి రూ.31,390గా రూ.31,240గా నమోదయ్యాయి. గత నాలుగు సెషన్లలో బంగారం ధరలు రూ.500 మేర పెరిగాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!