దుబాయ్ లో నటి శ్రీదేవి శవ పంచనామాలో సహాయకుడిగా పనిచేసిన ప్రవాస భారతీయుడు
- February 28, 2018_1519834850.jpg)
_1519834850.jpg)

దుబాయ్ : శ్రీదేవిని నేను ఎప్పుడూ చూడలేదు...ఆమె సినిమా సైతం నేనెన్నడూ చూడలేదు ఆమె మృతదేహమైన ..సామాన్యుల భౌతికకాయమైనా తనకు ఒకటేనని పేద.. ధనిక అనేది చూడనిది మరణం ఒకటేనని పోస్ట్ మార్టం థియేటర్ లో సహాయకుడిగా పనిచేసే అష్రఫ్ పేర్కొన్నాడు. దుబాయి సమీపంలోని అజ్మాన్ లో అష్రఫ్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆత్మీయులు ఎవరైనా ఆకస్మికంగా చనిపోతే, ఆ దుఖం ఏ ఒక్కరూ ఆపలేనిదని...తనకు ఓ ధనికుడి కంటే పేదవాడికి సాయం చేస్తేనే తనకు మానసికంగా ఎంతో సంతృప్తి కలుగుతుందని కేరళాకు చెందిన అష్రఫ్ తమరచ్చేరి నిర్వేదంగా తెలిపాడు...దుబాయిలో ఒక సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఈయన చేసే పని... మార్చురీలో శవపరీక్షలు జరిగినపుడు (ముఖ్యంగా ప్రవాసుల మృతదేహాలకు) - వైద్యులకు సాయపడడం, ఆ ప్రక్రియ పూర్తయ్యాక- పార్థివదేహాన్ని మళ్లీ అన్ని రసాయనాలతో కలిపి- పాడవకుండా దేహానికి పూయడం..మృతదేహానికి ఒక ఓ ఆకృతి ఇచ్చి మృతుని బంధువులకు అందచేయడం అష్రఫ్ బాధ్యత. ఇదో మంచిపనిగా తానూ విభావించడం వలన ఈ వృత్తిలో కొనసాగుతున్నట్లు వివరించాడు. ఇప్పటివరకు తాను 2 ,500 మంది ప్రవాసీయుల మృతదేహాలకు- చట్టపరంగా చేయవల్సిన ప్రక్రియలు పూర్తి చేసి వారి స్వస్ధలాలకు పంపించారు. సినిమా తార నటి శ్రీదేవిని తాను ఎన్నడూ చూడలేదని .. కనీసం ఆమె నటించిన సినిమాలు కూడా చూడలేదన్నారు. అనూహ్య పరిస్థితులలో విగతజీవిగా మారి మార్చురీకి వచ్చిన తర్వాత తొలిసారిగా చూసినట్లు వివరించాడు.. శ్రీదేవి కేసులో దుబాయి ప్రభుత్వ అధికారులతో వ్యవహరించడానికి భారత కాన్సులేటు- ఆయనకు వకలా (పవర్ అఫ్ అటార్నీ లాంటిది) ఇచ్చింది. మార్చురీలోకి బోనీ కపూర్ తరఫున ఆయన మేనల్లుడు సౌరభ్ మల్హోత్రాను మాత్రమే దుబాయిలో అధికారులు అనుమతించారు. శ్రీదేవిని ఎన్నడూ అష్రఫ్ చూడకపోవడంతో- సౌరభ్ చూపిన మీదట- ఆమెను గుర్తించినట్లు సంతకం పెట్టి, తన వీసా కాపీని మార్చురీలో ఇచ్చి - ఇక అక్కడ నుంచి తాను చేయాల్సిన పనులు చేపట్టాడు. శ్రీదేవి భౌతికకాయాన్ని తిరిగి విమానాశ్రయంలో చేర్చే దాకా ఆయనే ఆ భౌతికాయం వెంట ఉన్నారు. బోనీ కపూర్ గానీ, మిగిలిన కుటుంబ సభ్యులు గానీ తనతో ఏమీ మాట్లాడలేదు. అనిల్ అంబానీ పంపిన ప్రత్యేక విమానంలో తరలించారు. కేంద్ర ప్రభుత్వం విదేశాలలో ప్రవాసీయుల సేవలను గుర్తించి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ప్రవాసీ సమ్మాన్ ఆవార్డు గ్రహీత అయిన అష్రఫ్- శ్రీదేవితో పాటు మరో నాలుగు మృతదేహాలను కూడా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు పంపారు. శ్రీదేవి కేసు దర్యాప్తు, శవపరీక్ష అన్నీ చట్టప్రకారమే జరిగాయని అష్రఫ్ వివరించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







