ప్రవాసీయుల కోసం 2,140 ఉద్యోగాల నియామకాలు
- February 28, 2018
కువైట్:స్థానికరణ ...మన ఉద్యోగాలు మనకే అనే విప్లవం ఎందుచేతనో కొద్దిగా సడలించబడింది. వైద్యపరమైన ఉద్యోగాలలో తమ దేశం వారికి ఇస్తే , ఎందుకొచ్చిన ప్రాణాలతో చెలగాటం అనుకొనేమో ఆ వైద్య సంబంధిత ఉద్యోగాలు ప్రవాసీయులకు వదిలిపెడుతున్నారు. 13 నూతన ప్రాజెక్టులు, విస్తరణ పనుల కోసం మానవ వనరుల అవసరాల కోసం కువైట్ దేశస్థులు కానీ ప్రవాసీయులు కోసం 2,140 ఉద్యోగాల ఖాళీలని భర్తీ చేయాలని సివిల్ సర్వీస్ కమిషన్ (సిఎస్సి) కోరింది. స్థానిక అరబిక్ మీడియా తెలిపిన ఒక నివేదిక ప్రకారం, జబెర్ అల్ అహ్మద్ హాస్పిటల్లో పని చేసేందుకు 600 మంది నిపుణులైన వైద్యులు అవసరం ఏర్పడింది. దీంతో పాటు 1,540 నర్సింగ్ ఉద్యోగాలు మరియు 240 సాంకేతిక నిపుణులు. రోగులకు అత్యుత్తమ సేవలను అందించే లక్ష్యంతో 1,540 ఉద్యోగ అవకాశాలను ఏర్పరుస్తున్నట్లు చేయనున్నట్లు నివేదిక తెలిపింది. ఏడు ఆరోగ్య కేంద్రాలు, అమరి, జబీర్ అల్-అహ్మద్ ఆస్పత్రులకు ఈ సిబ్బంది అవసరం ఉంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







