ప్రవాసీయుల కోసం 2,140 ఉద్యోగాల నియామకాలు

- February 28, 2018 , by Maagulf
ప్రవాసీయుల  కోసం 2,140 ఉద్యోగాల నియామకాలు

కువైట్:స్థానికరణ ...మన ఉద్యోగాలు మనకే అనే విప్లవం ఎందుచేతనో కొద్దిగా సడలించబడింది. వైద్యపరమైన ఉద్యోగాలలో తమ దేశం వారికి ఇస్తే , ఎందుకొచ్చిన ప్రాణాలతో చెలగాటం అనుకొనేమో ఆ వైద్య సంబంధిత ఉద్యోగాలు ప్రవాసీయులకు వదిలిపెడుతున్నారు. 13 నూతన ప్రాజెక్టులు, విస్తరణ పనుల కోసం మానవ వనరుల అవసరాల కోసం కువైట్ దేశస్థులు కానీ ప్రవాసీయులు కోసం 2,140 ఉద్యోగాల ఖాళీలని భర్తీ చేయాలని సివిల్ సర్వీస్ కమిషన్ (సిఎస్సి) కోరింది. స్థానిక అరబిక్ మీడియా తెలిపిన ఒక నివేదిక ప్రకారం, జబెర్ అల్ అహ్మద్ హాస్పిటల్లో పని చేసేందుకు  600 మంది నిపుణులైన వైద్యులు అవసరం ఏర్పడింది. దీంతో పాటు 1,540 నర్సింగ్ ఉద్యోగాలు మరియు 240 సాంకేతిక నిపుణులు. రోగులకు అత్యుత్తమ సేవలను అందించే లక్ష్యంతో 1,540 ఉద్యోగ అవకాశాలను ఏర్పరుస్తున్నట్లు చేయనున్నట్లు నివేదిక తెలిపింది. ఏడు ఆరోగ్య కేంద్రాలు, అమరి, జబీర్ అల్-అహ్మద్ ఆస్పత్రులకు ఈ సిబ్బంది అవసరం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com