దూసుకొస్తున్న చరణ్ విమానాలు..

- May 05, 2015 , by Maagulf
దూసుకొస్తున్న చరణ్ విమానాలు..

  ' ట్రూ జెట్ ' పేరుతో టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ తేజ బ్రాండ్ అంబాసిడర్‌గా టర్బో మేఘ విమాన సేవలు ప్రారంభంకానున్నాయి. ఈ సేవలు జూన్ నెల నుండి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నామని , జూన్ నెలాఖరులోగా తొలి విమానం ఎగురుతుందని టర్బో మేఘ ఎయిర్‌వేస్ ఫౌండర్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. డీజీసీఏ అనుమతులు కూడా తుది దశలో ఉన్నాయన్నారు. ఒక్క తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా అటు ఉత్తరాదీన అహ్మదాబాద్ , పుణే , గోవాలలో కూడా ఈ సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఉమేష్ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా రీజనల్ షెడ్యూల్ ఎయిర్‌లైన్స్ సర్వీసులను కూడా టర్బో మేఘ ఎయిర్‌వేస్ ఇప్పుడు ప్రారంభించనుంది. ముఖ్యంగా దేశంలో పెద్ద పెద్ద నగరాలతో పాటు చిన్న పట్టణాలలో కూడా విమాన సర్వీసులకు డిమాండ్ అధికంగా ఉందని , దీన్ని దృష్టిలో పెట్టుకొని ద్వితీయశ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ఉమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమాన ఇంధనంపై పన్నులను తగ్గించిందని , తెలంగాణ ప్రభుత్వం కూడా పన్నులను తగ్గించాలని కోరుతున్నామని ఉమేశ్ అన్నారు . 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com