హ్యాపీ హ్యాపీ హోళీ
- February 28, 2018
హైదరాబాద్ : హోళీ అంటే రంగులు..హోళీ అంటే స్టెప్పులు, కేరింతలు. హోళీరోజు రంగులు చల్లుకుంటూ యూత్ తెగ ఎంజాయ్ చేస్తారు. శీతాకాలం చలిగాలుల నుంచి ఆహ్లాదకర వసంత రుతువులోకి అడుగుపెట్టడానికి గుర్తు హోళీ. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా జనం సంబరాల్లో మునిగితేలుతారు. హోళీ అంటే రంగుల కలబోత, మనుషుల రంగుల జీవితానికి దర్పణంగా హోళీ నిలుస్తుంది. కష్ట-సుఖాల కలబోతే ఈ రంగుల పండుల. చెడుపై మంచి గెలిచిన రోజుగా కొందరు హోళీ చేసుకుంటే మరికొందరు శీతాకాల చలి గాలుల నుంచి ఆహ్లోదకర వసంతరుతువులోకి ప్రవేశానికి హోళీ మోదటి మజీలీగా భావించి హోళీని జరుపుకుంటారు. అనుబంధాలకు అనురాగ అప్యాయతలకు రంగులకు అవినాభావ సంబంధం ఉంది.
భారత్ అంటేనే పండుగుల దేశం. దేశంలో ఏదోఒక ప్రాంతంలో పండుగ సందడి నెలకొనే ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రజల్ని ఏకం చేసి, ఆనందంతో చిందులు వేసే పండుగ అంటే హోళీనే గుర్తుకు వస్తుంది. కులాలు, మతాలు, ప్రాంతాల కతీతంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరు కలసి జరుపుకునే రంగుల పండుగ హోళీ. రంగులతో సయ్యాటలే కాదు.. నోరూరించే తీపి వంటకాల ఘుమఘుమలు కూడా హోళీ ప్రత్యేకత. రంగులు చల్లుకుంటూ.. తీపిరుచులను ఆస్వాధీస్తూ జనం చేసే సందడి అంతా ఇంతాకాదు.. ఒక రకంగా దేశం మొత్తం బృదావనంలా మారిపోవడం హోళీ ఈ పండుగలోనే చూస్తూ ఉంటాం.
అయితే సంతోషం, కేరింతల వెనుక ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయంటున్నారు వైద్యులు. నేచురల్ కలర్స్ చల్లుకుంటే ఫర్వాలేదుకాని.. ప్రమాదకర రసాయనాలతో తయారైన రంగులు చల్లుకుంటే.. చర్మసంబంధ రోగా వస్తాయంటున్నారు. అంతేకాదు.. కల్తీరంగుల ధూళిని పీలిస్తే శ్వాసకోశవ్యాధుల వస్తాయంటున్నారు. చెవులు, కళ్లకు కూడా హాని జరిగే ప్రమాదం పొంచి ఉందటున్నారు డాక్టర్లు. ఒక్కోసారి కంటిచూపును కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రంగులు చల్లుకునే సమయంలో కళ్లకు ప్రొటెక్టివ్ గ్లాసెస్ ధరించాలని సూచిస్తున్నారు.
హోళీ అంటేనే రంగుల పండగ సరదాగా బంధుమిత్రులతో, కుటుంభ సభ్యులతో రంగులు చల్లుకుంటు ఎంజాయ్ చేయండి.. కాని సహజమయిన రంగులు వాడటంతో పాటు వైద్యులు సూచిస్తున్న చిన్న చిన్న జాగ్ర్తత్తలు పాటిస్తు రంగుల పండుగను ఎంజాయ్ చేయండి. హ్యాపీ అండ్ సేఫ్ హోళీ.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..