ఒమన్‌లో మవసలాత్ కొత్త బస్ రూట్స్
- February 28, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ మవసలాత్, ఒమన్‌లో మరిన్ని కొత్త బస్ రూట్స్‌ని ప్రకటించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. మస్కట్ పరిధిలో 10 కొత్త లైన్స్‌ని ఏర్పాటు చేయనున్నారు. మస్కట్‌తో సలాలా, బురైమి, అద్ దుక్మ్ మరియు షన్నా ప్రాంతాల్ని కలిపేందుకు కొత్త రూట్స్‌ని కూడా ప్లాన్ చేస్తోంది మవసలాత్. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ అండర్ సెక్రెటరీ సలీమ్ అల్ నైమి మాట్లాడుతూ, 2018లో మస్కట్‌తో సలాలా, బురైమి, అద్ దుక్మ్, షన్నాలను కలిపే కొత్త రూట్స్ ప్రారంభించనున్నామని చెప్పారు. 2016తో పోల్చితే, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ని వినియోగిస్తోన్నవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. 2017లో మొత్తం 4.5 మిలియన్ ప్యాసింజర్లు మవసలాత్‌ని ఆదరించారు. 2016లో ఈ సంఖ్య 3.7 మిలియన్లుగా ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..