ఇద్దరు భార్యలున్న ఎమిరేటీలకు హౌసింగ్ అలవెన్స్
- February 28, 2018
దేశంలో పెళ్ళికాని మహిళల సంఖ్య తగ్గించే క్రమంలో యూఏఈ అథారిటీస్, ఇద్దరు భార్యలున్న ఎమిరేటీ పురుషులకు హౌసింగ్ అలవెన్స్ ఇవ్వాలని నిర్ణయించాయి. యూఏఈ మినిస్టర్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ డాక్టర్ అబ్దుల్లా బెల్హాఫ్ అల్ నౌమి, ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సెషన్ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. షేక్ జాయెద్ హౌసింగ్ ప్రోగ్రామ్‌ని రెండో భార్య కోసం కేటాయిస్తున్నట్లు చెప్పారాయన. మొదటి భార్యతో సమానంగా రెండో భార్యకీ లివింగ్ ఎరేంజ్‌మెంట్స్ చేయడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యమని మినిస్టర్ చెప్పారు. ఎఫ్‌ఎన్‌సి సెషన్‌లో సభ్యులు, ఈ హౌసింగ్ అలవెన్స్ ద్వారా యూఏఈలో పెళ్ళికాని మహిళల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఓ వ్యక్తి రెండో మహిళను పెళ్ళి చేసుకోవడానికి వీలుగా ప్రొసిడ్యూర్‌ని సరళతరం చేయాల్సి ఉందని ఎఫ్‌ఎన్‌సి మెంబర్ హమాద్ అల్ రహూమి అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..