వైట్ హౌస్‌కు కమ్యూనికేషన్ డైరెక్టర్ రాజీనామా
- February 28, 2018
వాషింగ్టన్: వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ హోప్ హిక్స్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సలహాదారుగా ఉంటున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయం నుండి ట్రంప్ అధ్యక్షుడైయ్యేంత వరకు వెన్నంటి ఉన్న హోప్ రాజీనామా ఇవ్వడంతో వైట్‌హౌస్‌లోని చాలా మంది సభ్యులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2016 లో అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై హౌస్ ప్యానెల్ విచారించిన మరుసటి రోజే ఆమె రాజీనామా చేయడం గమనార్హం. ఈ మూడేళ్లలో హోప్ సలహాదారునిగా అద్భుతంగా వ్యవహరించారని ఆమెను ప్రశంసిస్తూ ట్రంప్ ప్రకటనను విడుదల చేశారు. ఆమెను చాలా మిస్సవుతున్నానని తెలిపారు. భవిష్యత్తులో మళ్లీ ఆమెను కొనసాగించే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు.
అప్పుడప్పుడు ఆమె ట్రంప్‌కు రష్యా దర్యాప్తు విషయంలో అబద్ధాలు చెప్పిందని హౌస్ ఇంటలిజెన్స్ ప్యానెల్ వెల్లడించింది. అయితే తాను ఎలాంటి అబద్ధాలు చెప్పలేదని హోప్ పేర్కొన్నారు. రాబర్ట్ ముల్లర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక కౌన్సిల్ కూడా ఆమెను ప్రశ్నించింది. మాజీ మోడల్ అయిన హౌప్ గతంలో ట్రంప్ కుమార్తె ఇవాంక కోసం పని చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







