అక్కడ ఆకలి తీర్చుకోవాలంటే.. అధికారుల సెక్స్ కోరిక తీర్చాల్సిందే...!!
- March 01, 2018
గత కొన్ని ఏళ్లుగా అంతర్యుధ్ధం చిక్కుకొని నిత్యం బాంబు దాడులతో.. తుపాకుల మోతతో.. బాల్యం రక్తసిక్తమవుతుంది. శిధిలాల నెత్తుటి చారికలతో పసితనం రక్తమోడుతోంది. రక్తపుటేరుల మధ్య బాల్యం ఎలా నలిగి పోతుందో ప్రపంచానికి చాటుతూ... ఉన్న చిన్నారుల ఫోటోలు చూసేవారి కంట తడి పెట్టిస్తున్నాయి. ఇది ఓ వైపు మరో వైపు అక్కడ మహిళలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులను అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. సహాయక కేంద్రాల్లో మహిళలు సహాయం పొందాలంటే అక్కడ ఉన్నవారి లైంగిక వాంఛలు తీర్చాల్సి వస్తుందని ఆ నివేదికల్లో ఉన్నది.
సిరియా ఐసీస్ కబందహస్తాల నుంచి బయటపడానికి ప్రయత్నిస్తోంది. అయితే అక్కడ సహాయ కేంద్రాల్లో పనిచేసే పురుషుల కోరికలను తీరిస్తేనే.. తమకు సహాయం అందుతుంది అని బాధిత మహిళలు మీడియా దృష్టికి తీసుకొని వచ్చారు. అంతేకాదు.. అక్కడ మహిళలు సహాయ కేంద్రాలు అంటే భయపడే పరిస్థితులు వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి.
దీంతో అక్కడ అంతర్జాతీయ సేవా సంస్థల ద్వారా ఉచితంగా అందే సహాయాన్ని తీసుకోవడానికి కూడా మహిళలు భయపడే స్టేజ్ లో ఉన్నారు. తమకు భోజనం కావాలన్నా సహాయక కేంద్రాల్లో పనిచేసే పురుషులకు తమ జీవితాన్ని అర్పించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే రోజువారీ ఆహారం కోసం యువతులు అమ్మాయిలు పరిమిత కాలం పెళ్లిళ్లు చేసుకొని అక్కడ అధికారులకు 'సెక్యువల్ సర్వీసెస్' అందిస్తున్నారు. ఇక సహాయం తీసుకోవడానికి వచ్చిన మహిళల ఫోన్ నెంబర్లు తీసుకొని వారిని వారింటి వద్ద వదులుతున్నారని తాము అందజేస్తున్న సహాయాలకు ప్రతిగా అధికారుల ప్రతినిధులు కోరిక తీర్చుకుంటున్నారని... వాయిస్ ఫ్రమ్ సిరియా 2018 నివేదిక వెల్లడించింది. సిరియా గవర్నర్ పాలనలో వివిధ ప్రాంతాల్లో మానవతా సహాయానికి ప్రతిగా లైంగిక దోపిడి సౌగుతున్నట్లు గత ఏడాది యూఎన్ ఎఫ్ ఈ ఏ చేసిన పరిశీలనలో వెల్లడైంది.
జోర్డాన్ లోని ఓ శరణార్ధుల శిబిరంలో సిరియా మహిళా బృందం పై ఇటువంటి లైంగిక దాడులు జరిగినట్లు మొదటి సారి మూడేళ్ళ క్రితం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా భర్తను కోల్పోయిన అమ్మాయిలు, విడాకుల తీసుకున్నావారు, పురుషుల పరిరక్షణ లేని మహిళల పరిస్తితి అక్కడ మరింత దారుణంగా ఉందని... దారా, క్యూనీత్ర తదితర ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై తాను జరిపిన పరిశీలనల్లో ఇది యదార్ధామేనని తెలిసింది అని స్వచ్ఛంద సహాయ సలహాదారు డానియల్ స్పెన్సర్ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







