వైఎస్ఆర్ గా మమ్ముట్టి

- March 02, 2018 , by Maagulf
వైఎస్ఆర్ గా మమ్ముట్టి

టాలీవుడ్ ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ మొదలైయింది. ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీపార్వతి బయోపిక్, సావిత్రి బయోపిక్ లు తెరకేక్కుతున్నాయి. ఇప్పుడు మరో బయోపిక్ కు రంగం సిద్దమైయింది. దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ఇది.

గతంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌..నటుడు రాజశేఖర్‌తో కలిసి వైఎస్సార్‌ బయోపిక్‌ తీయాలని అనుకున్నారట.కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇప్పుడు 'ఆనందో బ్రహ్మ' లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి. రాఘవ్‌ వైఎస్సార్‌ బయోపిక్‌ తెరకెక్కించనున్నారు. స్క్రిప్ట్ వర్క్ స్టేజి లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెల్లబోతోంది. వైఎస్ ఆర్ పాత్రలో మలయాళం నటుడు మమ్ముట్టి నటించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు మమ్ముట్టి ఈ సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com