దుబాయ్:1.5 మిలియన్‌ దిర్హామ్‌ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్‌

- March 02, 2018 , by Maagulf
దుబాయ్:1.5 మిలియన్‌ దిర్హామ్‌ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్‌

దుబాయ్:పార్క్‌ చేసిన బెంట్లే కారు నుంచి 1.5 మిలియన్‌ దిర్హామ్‌లు దొంగిలించిన కేసులో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దొంగతనలో ఓ సెలూన్‌ వెహికిల్‌ కూడా పాల్గొన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ వెహికిల్‌కి సంబంధించిన సమాచారాన్ని పసిగట్టిన పోలీసులు, జుమైరా వైపుగా వెళుతున్నట్లు దుబాయ్‌ పోలీసులు గుర్తించారు. స్మార్ట్‌ టెక్నాలజీ ద్వారా వాహనాన్ని గుర్తించి, సమీపంలో ఉన్న పెట్రోల్‌ కార్స్‌ని అప్రమత్తం చేయడం జరిగింది. అల్‌ వసల్‌ స్ట్రీట్‌లో ఆ వాహనాన్ని గుర్తించి, వాహనంతోపాటుగా ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com