బీన్స్ ఆరోగ్యానికి మంచిది...
- March 02, 2018ప్రకృతి మనకు ఎన్నో ఆహార పదార్థాలను ఇచ్చింది. అయితే మనం నిత్యం ఆహారంగా తీసుకునే పదార్థాలు శరీరం మీద, ఆరోగ్యం మీద ప్రభావితం చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే శృంగార సామర్ద్యం విషయానికి వస్తే దానిని పెంచడానికి, తగ్గించడానికి కూడా పలు ఆహారపదార్థాలు పని చేస్తాయి. శృంగార సామర్థ్యం పెరగడం మాట అటు ఉంచితే తగ్గించే పదార్థాలను తినకూడదు. అదీ ముఖ్యంగా రాత్రిపూట శృంగారంలో పాల్గొనాలనుకున్నప్పుడు భార్యాభర్తలిద్దరూ కొన్ని ఆహార పదార్థాలను తినకూడదట. అవేంటో చూద్దాం.
1. బీన్స్
మన శరీరానికి బీన్స్ చాలా మేలు చేస్తాయి. అనేక రకాల పోషక పదార్థాలు ఇందులో ఉన్నాయి. అయితే శృంగారంలో పాల్గొనే ముందు ఇవి తినకూడదు. ఇవి గ్యాస్ ప్లోటింగ్‌కి కారణమవుతాయి. కనుక శృంగారం విషయంలో ఇబ్బందిని కలిగిస్తాయి.
2. ఎనర్జీ డ్రింక్స్
వీటిని తాగడం వల్ల తక్షణ శక్తి లభించినప్పటికి త్వరగా నీరసం వస్తుంది. సత్తువ నశిస్తుంది. కనుక శృంగారానికి ముందు వీటిని తాగరాదు.
3. మాంసం
మాంసాహారం త్వరగా జీర్ణం కాదు. ఇది తింటే గ్యాస్ వచ్చి కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దానివల్ల శృంగారంలో తృప్తిగా పాల్గొనలేరు. కాబట్టి శృంగారానికి ముందు మాంసాహారం తినకూడదు.
4. ఓట్స్
వీటిలో పైబర్ ఎక్కువగా ఉన్న కారణంగా ఇవి ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఈ క్రమంలో శృంగారంలో పాల్గొనే ముందు ఇవి తింటే ఇబ్బంది కలుగుతుంది.
5. చూయింగ్ గమ్
దీనిలో శృంగారాన్ని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. కనుక శృంగారానికి ముందు ఇవి తినకూడదు.
6. ఆల్కాహాల్
ఇది తీసుకోవడం వల్ల శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. దానివల్ల శృంగారంలో సరిగా పాల్గొనలేరు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!