'స్లైమ్' టాయ్స్‌పై మునిసిపాలిటీ హెచ్చరిక
- March 02, 2018
దుబాయ్:దుబాయ్ మునిసిపాలిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సేఫ్టీ డైరెక్టర్ ఇంజనీర్ రిదా సల్మాన్, దుబాయ్‌లోని చిన్నారుల తల్లిదండ్రులకు 'స్లైమ్' టాయ్స్‌పై హెచ్చరికలు జారీ చేశారు. ఈ టాయ్స్‌లో టాక్సిక్ కెమికల్స్ ఉంటాయని, అవి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం మూడు రకాలైన స్లిమె టాయ్స్ అందుబాటులో ఉన్నాయి. మొదటి రకం సహజసిద్ధమైన మెటీరియల్స్‌తో తయారు చేస్తారనీ, అవి ప్రమాదకరం కావని ఆయన వివరించారు. రెండో రకం టాయ్స్‌ని బేబీ పౌడర్, గ్లూ మరియు వాటర్‌తో తయారు చేస్తారనీ ఇవి తక్కువ టాక్సిక్ ప్రభావం కలిగి ఉంటాయనీ, మూడో రకం మాత్రం బోరాక్స్, లాండ్రీ డిటర్జెంట్, గ్లూ, వాటర్ మరియు కలరింగ్ ఏజెంట్స్‌తో తయారు చేస్తారనీ, అవి అత్యంత విషపూరితమైనవని మునిసిపాలిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







