4 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నేపాల్ యువకుడు

- March 02, 2018 , by Maagulf
4 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నేపాల్ యువకుడు

దుబాయ్: అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని పసిపిల్లపై అకృత్యానికి పాల్పడ్డాడా  నేపాల్‌ యువకుడు. 24 ఏళ్ల వయస్సు గల ఆ కామాంధుడు దుబాయ్ నగరంలోని ఓ ప్రాంతంలో క్లినర్‌గా పనిచేస్తున్నాడు. తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ సమీపంలో ఒంటరిగా కనిపించిన ఓ నాలుగేళ్ల బాలికను ఓ ఫ్లోట్‌లోకి తీసుకెళ్లి తలుపులు మూశాడు. నిందితుడు తన దుస్తులన్నీ విప్పేసి బాలికను ఎక్కడెక్కడో  అసభ్యకరంగా తాకాడు. అసభ్యకర రీతిలో ముద్దులు పెట్టాడు. అనంతరం తలుపులు తెరవడంతో బాలిక అక్కడి నుంచి ఇంటికి పరుగుతీసింది. తన తల్లిని చూసి ఏడ్చింది. కానీ జరిగిన విషయం చెప్పలేకపోయింది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో సైతం బాగా ఆందోళన చెందింది. మళ్లీ నిందితుడు  ఏమైనా చేస్తాడేమోనని విపరీతమైన ఆందోళనకు గురైంది. కానీ తల్లితో చెప్పలేదు. మరుసటి రోజు స్కూల్ నుంచి తల్లితో కలిసి ఇంటికి వస్తున్న సమయంలో నిందిత యువకుడు కనిపించడంతో  కంగారు పడి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారు అపార్ట్మెంట్ లో సీసీ కెమేరాలలో పరిశీలించగా నిందిత యువకుడు బాలికను తీసుకెళ్తున్నట్టు సి సి ఫుటేజ్ లో నమోదైంది. బాలిక చెప్పిన విషయాలన్నీ సరిపోలాయని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై కోర్టులో విచారణ ప్రారంభైమనట్లు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com