పారిస్ లో మంచు దాటికి 55 మంది మృతి

- March 03, 2018 , by Maagulf
పారిస్ లో మంచు దాటికి 55 మంది మృతి

పారిస్‌ : యూరప్‌ అంతటా భారీగా మంచు కురుస్తున్నది. దీంతో యూరప్‌ ఖండంలోని అన్ని దేశాల్లో విమానాలు రద్దు కావడమో లేదా ఆలస్యం కావడమో జరుగుతోంది. అటు ఉత్తరం నుండి ఇటు దక్షిణం వరకు అన్ని దేశాలు మంచు గుప్పిట ముడుచుకున్నాయి. భయంకరంగా కురుస్తున్న హిమపాతానికి యూరప్‌ దేశాల్లో 55మంది మరణించారు. వీరిలో 21మంది పోలెండ్‌లోనే మృతి చెందారు. స్లోవేకియాలో ఏడుగురు, చెక్‌ రిపబ్లిక్‌లో ఆరుగురు, లిథుయేనియాలో ఐదు, ఫ్రాన్స్‌లో నలుగురు, స్పెయిన్‌లో ముగ్గురు మరణించారు. ఈ ఏడాది ఈ సమయంలో యూరప్‌లో ఎక్కువ భాగంలో మంచు తుపానులు అసాధారణమే. తుపానుల కారణంగా రహదారులన్నీ మంచుతో కప్పబడిపోతున్నాయి.

వేలాదిమంది డ్రైవర్లు మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. స్కూళ్ళు మూతపడ్డాయి. పలు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఒకటి రెండు రోజులు కొనసాగుతుందని వాతావరణ సంస్థలు భావిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువమంది వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు వున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నిరుపేదలు, నిరాశ్రయులు, వలసవచ్చిన వారు ఎక్కువగా ఈ మంచు బారిన పడుతున్నారని ఆ ప్రకటన తెలిపింది. విపరీతంగా మంచు కురుస్తుండడంతో గురువారం జెనీవా విమానాశ్రయం కొద్ది గంటల పాటు మూతపడింది. స్విట్జర్లాండ్‌లో ఉష్ణోగ్రత మైనస్‌ 40సెల్సియస్‌గా నమోదైంది. ఉత్తర ఇటలీలో భారీగా కురిసిన మంచుతో 50శాతానికి పైగా రైళ్ళు రద్దయ్యాయి.ఎక్కడ చూసినా రహదారులు ట్రక్కులు, కార్లతో నిండిపోయి కనిపిస్తున్నాయి. పారిస్‌ మహా నగరం దట్టమైన మంచు దుప్పటి కప్పుకుంది. దాదాపు 3వేల మంది నిరాశ్రయులకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com