వియత్నాం అధ్యక్షునికి స్వాగతం పలికిన మోడీ
- March 03, 2018
న్యూఢిల్లీ : ద్వైపాక్షిక చర్చల కోసం భారత్‌లో పర్యటిస్తున్న వియత్నాం అధ్యక్షుడు త్రాన్ డై క్వాంగ్‌ను ఇక్కడి హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్రమోడీ స్వాగతం పలికారు. ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మొదటిగా వియత్నాం అధ్యక్షుడు రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో సంప్రదాయకంగా ఆతిథ్యాన్ని స్వీకరించారు. మూడు రోజుల భారత్ పర్యటన సందర్భంగా వియత్నాం అధ్యక్షుడు శుక్రవారం సాయంత్రం ఇక్కడకు చేరుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







