దుబాయ్ లో ఒక్క షెడ్యూల్‌కే రూ. 40 కోట్లు..!
- March 03, 2018
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్, ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం దుబాయ్‌లో మరో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది.
ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతో పాటు కొన్ని చేజ్ సీన్లు, యాక్షన్ సీన్లు చిత్రీకరించనున్నారట. అందుకు తగ్గట్టుగా ఈ ఒక్క షెడ్యూల్‌కు భారీ బడ్జెట్‌ను కేటాయించారు చిత్రయూనిట్. కేవలం దుబాయ్‌లో జరిగే షూటింగ్ కోసమే 40 కోట్ల రూపాయలు కేటాయించారట. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







